పొలాల గట్లపై విరివిరిగా మొక్కలు నాటాలి

హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పువ్వాడ

minister-puvvada

ఖమ్మం: రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం ఖమ్మం నగరం 3వ డివిజన్ పరిధిలోని బల్లెపల్లిలోమొక్కలు నాటారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా మొక్కలు నాటి హరిత తెలంగాణ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ మొక్కల నాటింపుతోనే సాధ్యమని పేర్కొన్నారు. పట్టణాలు, గ్రామాల్లోని ఖాళీ స్థలాలు, పొలాల గట్లపై విరివిగా మొక్కలు నాటాలన్నారు.

హరితహారం లక్ష్యాన్ని అనుగుణంగా మొక్కలు నాటేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హరితహారం విజయవంతానికి బాధ్యత తీసుకోవాలని ఆయన అభ్యర్థించారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతి, అటవీశాఖ అధికారి ప్రవీణ, అసిస్టెంట్ మున్సిపల్ కమినర్ మల్లేశ్వరి, కార్పొరేటర్ కొనకంచి సరళ, నాయకులు ప్రసాద్, అటవీ, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/