చిరుత దొరికేసింది..

జూపార్క్ కు తరలింపు

Cheetah found
Cheetah found

Hyderabad: గత కొన్ని నెలలుగా హైదరాబాద్ శివారు వాసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత ఎట్టకేలకు పట్టుబడింది.

రాజేందర్ నగర్ వాలంటరీ రైస్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో మొన్న రాత్రి చిరుత రెండు లేగదూడలను చంపింది.

ఈ సమాచారంతో అటవీ సిబ్బంది చిరుత లేగదూడలను చంపిన ప్రదేశంలో సీసీ కెమెరాలు, బోన్లు ఏర్పాటు చేశారు.

నిన్న అర్ధరాత్రి దాటిన తరువాత చిరుత అక్కడకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. అధికారులు  ఆ చిరుతను జూపార్క్ కు తరలించారు.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/