కనకపు సింహాసనమున..అంటూ కేటీఆర్ సంచలన ట్వీట్

మాజీ మంత్రి , బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. భారత 75 వ గణతంత్ర దినోత్సవాలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న క్రమంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పెద్దవాళ్లు ఎప్పుడో చెప్పారు అన్న క్యాప్షన్తో ‘కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి…’ పద్యాన్ని ఆయన షేర్ చేశారు.

దీంతో కేటీఆర్ ఎవరిని లక్ష్యంగా చేసుకుని ఆ ట్వీట్ చేశారోనన్న చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా నడుస్తోంది. గత నాల్గు రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో సీఎం vs బిఆర్ఎస్ గా వార్ నడుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ని ..కేటీఆర్ గుంపు మేస్త్రి అనడం..దానికి సీఎం సైతం కౌంటర్ ఇవ్వడం వంటివి జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన ట్వీట్ ఇప్పుడు మరింత కాక రేపుతోంది.