కాంగ్రెస్ కు అజహరుద్దీన్ రాజీనామా..?

గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ పదవుల భర్తీ కాంగ్రెస్‌లో ముసలం పుట్టించింది. తనకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడంపై టీపీసీసీ వరింగ్‌ ప్రెసిడెంట్‌ అజారుద్దీన్‌ తీవ్ర మనస్థాపం చెందారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, ఆమిర్ అలీ ఖాన్లను కాంగ్రెస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ విషయంలో అధిష్ఠానం తనకు మాట ఇచ్చిందని అజహర్ తాజాగా పేర్కొన్నారు. తనను కాదని ఆమిర్ కు ఎలా ఇస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ కోసం 18 ఏండ్లుగా పని చేస్తున్నానని గుర్తుచేశారు. ఏఐసీసీ పెద్దలతో మాట్లాడిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని అజారుద్దీన్‌ చెప్పారు.