చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరు పర్చండిః ఏసీబీ కోర్టు ఆదేశం

ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య హాజరు పరచాలని ఆదేశాలు

acb-court-approves-pt-warrant-in-fibernet-case

అమరావతిః విజయవాడ ఏసీబీ కోర్టులో టిడిపి అధినేత చంద్రబాబుకు నిరాశ ఎదురయింది. ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్ కు ఏసీబీ కోర్టు ఆనుమతించింది. సీఐడీ వేసిన పీటీ వారంట్ పై వాదనలను విన్న తర్వాత కోర్టు ఈ మేరకు తీర్పును వెలువరించింది. సోమవారం నాడు చంద్రబాబును ప్రత్యక్షంగా కోర్టు ముందు హాజరుపరచాలని ఆదేశించింది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు హాజరుపరచాలని ఆదేశాలు జారీ చేసింది. శుక్రవారం సుప్రీంకోర్టు తీర్పు వస్తే జోక్యం చేసుకోవచ్చని టిడిపి లాయర్లకు జడ్జి సూచించారు. కోర్టులో చంద్రబాబు తరపున దమ్మాలపాటి శ్రీనివాస్, సీఐడీ తరపున వివేకానంద వాదనలు వినిపించారు.