నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగిస్తా

సోషల్ మీడియా పై ప్రధాని వివరణ

narendra modi
narendra modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి సోషల్ మీడియాను వదిలేస్తానని ట్వీట్ చేసి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మోడి మరో ట్విస్ట్ ఇచ్చారు. తానెందుకు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లను వదిలేస్తానన్నది ఇప్పుడు స్పష్టం చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆదివారం ఒక్కరోజే తన సోషల్ మీడియా అకౌంట్లను వదిలేస్తున్నట్లు ప్రకటించారు.’ఆదివారం రోజు.. మహిళా దినోత్సవం. మనల్ని ఇన్‌స్పైర్ చేస్తున్న మహిళలకు నేను నా సోషల్ మీడియా అకౌంట్లను వాళ్లకు అప్పగిస్తా. అలా చేయడం వల్ల వాళ్లు లక్షలాది మందిని ఉత్సాహపరిచినట్లు అవుతుంది. మీరు అలాంటి మహిళేనా? లేదా అలాంటి మహిళలు మీకు తెలుసా? అయితే అలాంటి మహిళల స్టోరీస్
#SheInspireUs‌ తో ట్యాగ్ చేయండి’ అని ట్వీట్ చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/