తెలంగాణ ఎగ్జిట్‌పోల్స్ ఫై కేటీఆర్ కామెంట్స్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఈసారి బిజెపి పార్టీ మెజార్టీ స్థానాలు సాదించబోతుందని, ఓటర్లు బీజేపీ వైపు మెుగ్గుచూపారని, మెుత్తం 17 లోక్‌సభ స్థానాల్లో అధికార కాంగ్రెస్‌, బీజేపీల మధ్య ప్రధాన పోటీ సాగిందని , అధికార కాంగ్రెస్‌ 7 నుంచి 9 స్థానాల్లో గెలుస్తుందని, బీజేపీ 6 నుంచి 8, బీఆర్‌ఎస్‌, ఎమ్‌ఐఎమ్‌, చెరో స్థానంలో విజయం సాధిస్తాయని మెజార్టీ ఎగ్జిట్ సంస్థలు చెప్పడం ఫై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు.

తమకు ఎగ్జిట్ పోల్స్‌తో సంబంధం లేదని.. ఎగ్జాక్ట్ పోల్స్ కోసం ఎదురు చూస్తున్నామని అన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను పట్టించుకోమని కేటీఆర్ పేర్కొన్నారు. అనంతరం తెలంగాణ ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…తెలంగాణ దశాబ్ది వేడుకలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. తెలంగాణ కోసం అసువులు భాసిన అమరులకు కేసీఆర్‌తో సహా బీఆర్ఎస్ నేతలదంరూ నివాళులు అర్పించామని అన్నారు.అమరులను స్మరించుకుంటూ గన్ పార్క్ నుంచి అమరజ్యోతి వరకు ర్యాలీ నిర్వహించామని తెలిపారు.