ఏపీలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులకు అదనపు బాధ్యతలు

అమరావతి: ఏపీలో రెండు రోజుల క్రితం బదిలీ చేసిన ఐపీఎస్‌ అధికారుల్లో ఇద్దరికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ఐపీఎస్‌ అధికారి గుల్జార్‌కు వాణిజ్య పన్నులు, చేనేత జౌళి శాఖలు, చిరంజీవి చౌదరికి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల అదనపు బాధ్యతలు అప్పగించారు.

విశాఖపట్నం రేంజి డీఐజీ ఎస్‌. హరికృష్ణకు తీర ప్రాంత భద్రత విభాగం డీఐజీగా అప్పగించారు. కాకినాడ ఎస్పీ ఎం. రవీంద్రనాథ్‌బాబుకు కాకినాడలోని ఎపీఎస్పీ మూడో బెటాలిన్‌ కమాండెంట్‌గా పూర్తి అదనపు బాధ్యతలు, అనంతపురంలోని ఏపీఎస్పీ 14వ బెటాలియన్‌ కమాండెంట్‌ అజిత వేజెండ్లకు గుంతకల్లు రైల్వే పోలీసు ఎస్పీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/