జగన్ ఢిల్లీ టూర్..రెండు రోజుల పాటు అక్కడే

ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు. రెండు రోజుల పాటు హస్తిన లో గడపబోతున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ను విడుదల అయ్యింది. రేపు సాయంత్రం 4 గంటలకు సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరనున్నారు. సాయంత్రం 6.45 గంటలకు ఢిల్లీ చేరుకోనున్నారు.

ఈ నెల 31న దేశ రాజధానిలో జరగనున్న ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరుకానున్నారు. ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. రేపు మధ్యాహ్నం వరకు పల్నాడు జిల్లాలో జగన్ పర్యటించనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి 10.40 గంటలకు వినుకొండ చేరుకుంటారు. ఉదయం 11.05 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు వినుకొండ వెల్లటూరు రోడ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. జగనన్న చేదోడు వాదోడు పథకం లబ్దిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేయనున్నారు.