29 నుంచి హజ్‌యాత్ర ప్రారంభం
తక్కువ సంఖ్యలో భక్తులకు అనుమతి

మక్కా: కరోనా వైరస్ నేపథ్యంలో ముస్లింల హజ్‌యాత్ర నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 29వ తేదీ నుంచి తక్కువ సంఖ్యలో భక్తులకు అనుమతి ఇస్తూ.. హజ్ యాత్రను నిర్వహించనున్నారు. కేవలం వెయ్యి మంది ముస్లిం యాత్రికులకు మాత్రమే హజ్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వనున్నారు. పవిత్ర నగరం మక్కాలో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఏడాది 2.5 మిలియన్ల మంది యాత్రికులు వస్తుంటారు. అయితే ఈ సారి కరోనా వైరస్ కారణంగా యాత్రను తగ్గించారు. అత్యంత కఠినమైన ఆంక్షల నడుమ యాత్రను చేపట్టనున్నారు. 65 ఏళ్ల లోపు ఉన్న వారికి మాత్రమే అనుమతి ఉంటుంది.
హజ్ వేడుక జరిగే మౌంట్ అరాఫత్‌పై యాత్రికులను ఎక్కువ సంఖ్యలో గుమ్మికూడ కుండా ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రోజున అరాఫత్ పర్వతం వద్ద భారీ సంఖ్యలో యాత్రికులు చేరుకునే వీలున్నది. బుధవారం రోజున తొలి వేడుకను నిర్వహిస్తారు. ఇస్లామిక్ లూనార్ క్యాలెండర్ ఆధారంగా హజ్ యాత్ర జరుగుతుంది. కరోనా నేపథ్యంలో చాలా తక్కువ సంఖ్యలో యాత్రికులకు అవకాశం ఇవ్వనున్నట్లు గత నెలలోనే సౌదీ అరేబియా ప్రకటించింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/