బీజేపీలో చేరబోయే వారి లిస్ట్ తెలిపిన ఈటెల రాజేందర్

బిజెపి అధిష్టానం ప్రస్తుతం తన ఫోకస్ అంత తెలంగాణ ఫై పెట్టింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా రాష్ట్రంలో కాషాయం జెండా ఎగురవేయాలని పక్క ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అందుకే పార్టీ లోకి భారీగా చేరికలు చేస్తుంది. ఈ తరుణంలో హుజురాబాద్ బిజెపి ఎమ్మెల్యే , చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ చేరికల వ్యక్తుల ఫై క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల నుంచి బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని ఆయన అన్నారు.

దాసోజు శ్రవణ్, నర్సాపూర్ మున్సిపల్ ఛైర్మన్ మురళి యాదవ్, ఎర్రబెల్లి ప్రదీప్ రావు వంటి నేతలు బీజేపీలో చేరబోతున్నారని తెలిపారు. పార్టీలోకి వచ్చే ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతామని చెప్పారు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారని తెలిపారు. 21 నాటికి పలువురు రిటైర్డ్ ఐఏఎస్ లు, ఐపీఎస్ లు, బిజినెస్ మేన్లు, ఇతర పార్టీల నేతలు 10 నుంచి 15 మంది తమ పార్టీలో చేరనున్నారని చెప్పారు.

ఇక ఈరోజు ఢిల్లీ లో సీనియర్ నేత దాసోజు శ్రవణ్ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్తో భేటీ అయ్యారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో కలిసి చుగ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన శ్రవణ్కు శాలువా కప్పి సత్కరించారు. శ్రవణ్ తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చుగ్ బీజేపీ విద్యార్థి పరిషత్ తో పనిచేసిన శ్రవణ్ తో చాలాకాలం తర్వాత భేటీ కావడం సంతోషం కలిగించిందని అన్నారు. ప్రస్తుతం చూస్తున్నది ట్రైలర్ మాత్రమేనని, త్వరలోనే బీజేపీలో భారీ సంఖ్యలో చేరికలు ఉంటాయని చుగ్ స్పష్టం చేశారు.