కర్ణాటక సీఎంకు 25 వేలు జరిమానా

ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం

Karnataka CM to a fine of 25 thousand
Karnataka CM BS Yediyurappa

Bangalore: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టు రూ. 25 వేల జరిమానా విధించింది. ఓ కేసులో దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసినందుకు గాను కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

బెంగళూరు సమీపంలోని గంగేనహళ్లిలో 1.11 ఎకరాల భూమి డీనోటిఫికేషన్ ద్వారా యడియూరప్ప లబ్ధి పొందారన్న ఆరోపణలపై 2015లో కేసు నమోదైంది.

కలబురగి హైకోర్టు సంచార బెంచ్‌లో సామాజిక కార్యకర్త జయకుమార్ హీరేమఠ ఈ పిల్ దాఖలు చేశారు. డీనోటిఫికేషన్ ద్వారా మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి బంధువులకు కూడా మేలు జరిగిందని ఆయన ఆరోపించారు.

తాజాగా, ఈ కేసు విచారణ సందర్భంగా.. దర్యాప్తును కొనసాగించాలని లోకాయుక్తను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు కొనసాగకుండా అర్జీ వేసిన యడియూరప్పకు న్యాయమూర్తి జస్టిస్ మేకేల్ డి కున్హా రూ. 25 వేల జరిమానా విధించారు.

తాజా ‘మొగ్గ’ (చిన్నారుల ప్రత్యేకం) కోసం : https://www.vaartha.com/specials/kids/