మహరాష్ట్రలో ఒక్కరోజే 258 మంది కరోనాతో మృతి

ఒక్క రోజే 8 వేలకు పైగా కేసుల నమోదు

Maharashtra – corona virus

ముంబయి: మహరాష్ట్రలో కరోనా వైరస్‌ విజృంభిస్తుంది. గత 24 గంటల్లో 258 మంది కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. అలాగే, 8,308 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా కేసుల సంఖ్య 2,92,589కి పెరగ్గా, ఇప్పటి వరకు 11,452 మంది ప్రాణాలు కోల్పోయినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ముంబయి మురికివాడ ధారావిలో పది కేసులు నమోదయ్యాయి. మరోవైపు, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతుండగా, ఢిల్లీలో మాత్రం తగ్గుతోంది. కర్ణాటకలో నిన్న 3,693 కేసులు వెలుగు చూడగా, 115 మంది మరణించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 55,115కు పెరగ్గా, మరణాల సంఖ్య 1,147కు చేరుకుంది. కేరళలో నిన్న 791 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. ఒకరు మృతి చెందారు. 133 మంది కోలుకున్నారు.


తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/