213కు చేరిన కరోనా వైరస్‌ మృతులు

Coronavirus
Coronavirus

బిజీంగ్‌: చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ మరింతంగా పెరిగింది. రోజులు గడుస్తున్న కొద్దీ తన పరిధిని పెంచుకుంటోంది. చైనాలో ఈ వైరస్ అత్యంత భయానక పరిస్థితులకు కారణమైంది. ఈ వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య చైనాలో మొన్నటిదాకా 170 వరకు ఉండగా..ఒక్క రోజు తేడాలో 213కు చేరిందంటే దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చైనాలోని దాదాపు అన్ని ప్రావిన్స్‌ల్లోనూ కరోనా వైరస్ జాడ కనిపిస్తుంది. గురువారం నాటికి 9692 కేసులు నమోదయ్యాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. వైరస్ సోకిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు పేర్కొంది. 24 గంటల వ్యవధిలో కొత్తగా 43 మరణాలు సంభవించాయని, 1982 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయినట్లు స్పష్టం చేసింది. కరోనా వైరస్ పరిధి పెరగటం ఆందోళన కలిగిస్తున్నట్లు ఆరోగ్య కమిషనర్ అధికారులు చెప్పారు. దీన్ని నియంత్రించడానికి అందుబాటులో ఎలాంటి మార్గాలు కనిపించట్లేదని, అందుబాటులో ఉన్న అన్ని వనరులను వినియోగిస్తున్నామని అన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/