ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జగన్ ను సపోర్ట్ చేసిన లక్ష్మీ పార్వతి

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఫై లక్ష్మీ పార్వతి జగన్ ను సపోర్ట్ చేసింది. హెల్త్‌ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్‌ కుటుం సభ్యులు కూడా ఈ వివాదంపై స్పందించారు. ఈ తరుణంలో లక్ష్మీ పార్వతి జగన్ కు సపోర్ట్ గా మాట్లాడింది.

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు ఎందుకు చేశారో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని… ఎన్టీఆర్ చావుకు కారణమైన వ్యక్తి దీని పై గగ్గోలు చేస్తున్నాడని చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబు తన హయాంలో ఎప్పుడైనా ఎన్టీఆర్ పేరును శాశ్వతంగా ఉంచాలని ఒక్క ప్రయత్నం చేశాడా?? ఎన్టీఆర్ పేరు జిల్లాకు పెట్టాలా? యూనివర్సిటీకి పెట్టాలా? అని అడిగితే నేను జిల్లాకు పెట్టమనే చెబుతానని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ చేసిన వాదన ఆమోదయోగ్యంగా ఉందని.. యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ పేరు పెట్టి జగన్ గౌరవించారన్నారు.

ఎన్టీఆర్‌కు భారత రత్న రాకుండా అడ్డుకుని కుట్రలు చేసిన వ్యక్తి చంద్రబాబు అని… అప్పట్లో నా పై దుష్ప్రచారం చేసినట్లే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పై ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ అమాయకుడు అని.. తన స్వశక్తితో ఎదిగి నిలబడ్డాడన్నారు. లోకేష్ బాబా?? డేరా బాబా?? నా గురించి లోకేష్ మాట్లాడుతున్నాడు… అసలు అప్పుడు లోకేష్ పుట్టాడా అని ప్రశ్నించారు లక్ష్మీ పార్వతి.