కోవాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం

ఈ నెల 15న తొలి దశ ప్రారంభించినట్టు వెల్లడి

Clinical trials begin for Bharat Biotech’s COVID-19

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారికి భారత్ బయోటెక్ సంస్థ కోవాక్సిన్‌ పేరిట వ్యాక్సిన్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా భారత్ బయోటెక్ సంస్థ దీనిపై కీలక ప్రకటన చేసింది. ఈ నెల 15న కోవాక్సిన్‌ క్లినికల్ ట్రయల్స్ మొదటి దశ ప్రారంభించామని వెల్లడించింది. ఈ మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ లో 375 మంది పాలుపంచుకుంటున్నట్టు వివరించింది. దేశవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్ షురూ అయ్యాయని భారత్ బయోటెక్ పేర్కొంది. ఈ మేరకు ట్విట్టర్ లో వెల్లడించింది. దేశీయంగా తయారవుతున్న వ్యాక్సిన్ గా కోవాక్సిన్‌ కు ఎంతో గుర్తింపు లభిస్తోంది. ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశను విజయవంతంగా పూర్తిచేసుకుంటే వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. భారత్ బయోటెక్ హైదరాబాద్ కు చెందిన సంస్థ అని తెలిసిందే.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/