ఆస్కార్ ఫై ఆలస్యంగా స్పందించిన అల్లు అర్జున్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ రావడం పట్ల యావత్ దేశ ప్రజలు గర్వంగా ఫీల్ అవుతున్నారు. సినీ అభిమానులు, ప్రముఖులే కాదు అన్ని రంగాల వారు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలుపుతున్నారు. ఈ తరుణంలో అవార్డు రావడం పట్ల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్పందించారు. నిన్నటి నుండి యావత్ ప్రజానీకం , సినీ లోకం అభినందనలు తెలుపుతుంటే..అల్లు అర్జున్ ఇంతవరకు స్పందించలేదని అంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న క్రమంలో కాస్త ఆలస్యంగా స్పందించారు.

చిత్ర యూనిట్ సభ్యులలో ప్రతి ఒక్కరిని కూడా బన్నీ పొగడ్తలతో ముంచెత్తారు. ఇది భారతదేశానికి ఒక బిగ్ మూమెంట్ అంటూ తెలుగు సాంగ్ ఆస్కార్ వేడుకలో షేక్ చేయడం గొప్ప విషయం అని అన్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి లిరిసిస్ట్ చంద్రబోస్ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ సింగర్స్ కాలభైరవ – రాహుల్ సిప్లిగంజ్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లకు ప్రత్యేకంగా బన్నీ తన విశేస్ అందించాడు. ఈ మ్యూజిక్ మూమెంట్ పాసిబుల్ కావడానికి ముఖ్య కారణమైనటువంటి రాజమౌళి పై కూడా ప్రశంసలు కురిపిస్తూ హార్ట్ టచింగ్ మూమెంట్ ఫర్ ఇండియా అంటూ బన్నీ తన సోషల్ మీడియాలో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నారు.