ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య

జ్వరంతో బాధపడుతున్న ఐశ్వర్యారాయ్

ఆస్పత్రిలో చేరిన ఐశ్వర్యరాయ్‌, ఆరాధ్య
aishwarya-rai-and-daughter-aaradhya-admitted-nanavati-hospital

ముంబయి: ప‌్ర‌ముఖ న‌టి ఐశ్వ‌ర్యారాయ్ బ‌చ్చ‌న్ కరోనా పాజిటివ్ తో ఆస్ప‌త్రిలో చేరారు. వైరస్‌ లక్షణాలు స్పల్పంగా కనిపించడంతో నిన్న సాయంత్రం ముంబయిలోని నానావతి ఆస్పత్రిలో జాయిన్‌ అయ్యారు. ఈ విషయాన్ని ఆస్పత్రి వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈనెల 12 ఐశ్వర్యర్యాయ్‌, ఆరాధ్యకు కరోనా సోకిన విషయం తెలిసిందే. వైరస్‌ లక్షణాలు లేకపోవడంతో గత అయిదు రోజులుగా వైద్యుల సూచనతో వారు ఇంట్లోనే హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. అయితే లక్షణాలు బయటపడడంతో పాటు, విడవని జ్వరం వేధిస్తుండడంతో ఆమెను కూడా నానావతి ఆసుపత్రికి తరలించారు. కాగా, ఐశ్వర్య కుమార్తె ఆరాధ్యకు కూడా పాజిటివ్ రాగా, ఆ చిన్నారి హోమ్ ఐసోలేషన్ లో ఉంది. మరోవైపు అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ ప్రస్తుతం ముంబయి నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/