డైట్ లో ఉండాల్సినవి…

ఆహారం , ఆరోగ్యం

Ingredients to be in the diet

ఆహారం రుచిగానే కాదు, ఆరోగ్యంగానూ ఉండాలి. ఆహారంలో విటమిన్లలోపం తలెత్తకుండా జాగ్రత్త పడాలి. వాయు కాలుష్యం వలన తలెత్తే సమస్యలను పాలకూర, ముల్లంగి, ఆకుకూరల్లోని విటమిన్ – ఏ తగ్గిస్తుంది.

విటమిన్ బి శ్వాస కోశ వ్యవస్థను పటిష్టంగా ఉంచుతుంది. గుడ్ కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.. చిరు ధాన్యాలు, కాయ ధాన్యాలు, చిక్కుళ్ళు, రకరకాల విత్తనాలు, నట్స్, ఆకుకూరలు, అవకెడు , అరటి పండులో విటమిన్ – బి లభిస్తుంది.


విటమిన్ -సి గాయాలను తొందరగా మానేట్టు చేస్తుంది. కివి, నిమ్మ జాతి పండ్లు, స్ట్రాబెర్రీ, టొమాటో ల్లో సి-విటమిన్ ఎక్కువుగా దొరుకుతుంది. విటమిన్-ఇ లోపం వలన సిస్టిక్ పై బ్రయిడ్స్ , అటాక్సియా, నట్స్, బాదం, మొక్కజొన్న, సోయాబీన్స్ తింటే ఇ -విటమిన్ లోపం ఏర్పడదు.

జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/category/news/national/