వామాకు తో ఆరోగ్యం , అందం

ఇంటింటి చిట్కాలు

ajwain leaves benefits
ajwain leaves benefits

వాము అందరికీ తెలిసిందే.. ఇది ఎంత అందమైందో , అద్భుతమైందో తెలిస్తే ప్రతిఒక్కరూ ఈ మొక్కను తెచ్చి పెంచేస్తారు. ఇది మనసుకు హాయి గొల్పుతుంది. ఆరోగ్యాన్ని ఇస్తుంది.
ఆకుపచ్చని దళసరి నాకుతుంటే వాము మొక్క చూడ చక్కగా ఉంది మంచి పరిమళాలు వెదజల్లుతుంది. ఇంటికి శోభనిచ్చే ఇది ఒంటికి ఎంతో మేలు చేస్తుంది.
వామాకు నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కల్గిస్తుంది. ఈ ఆకు వాసన పీలిస్తే జలుబు తగ్గుతుంది. కఫము పడుతున్నట్టయితే గ్లాసుడు నీళ్లలో రెండు వాము ఆకులు మరిగించి వడకట్టి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దగ్గు, ఉబ్బసం శ్వాసకోశ వ్యాధులకు కూడా ఇది దివ్య ఔషధం
వామాకు లో ఎ ,బి,సి విటమిన్లు , అమినో ఆమ్లాలు , యాంటీ ఆక్సిడెంట్స్ , క్యాల్షియం ఉన్నందున ఇది మంచి పోషకాహారం . కడుపు నొప్పిని , జీర్ణ కోసం ఇబ్బందులను తొలగిస్తుంది.

వామాకులతో వేసే శనగపిండి బజ్జీలు చాలా రుచిగా ఉంటాయి.

స్వస్థ (ఆరోగ్య విషయాలు) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/health/