చంద్రబాబుపై అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సెటైర్లు

anil-kumar-yadav

అమరావతిః చంద్రబాబు కప్పను మింగిన పాములాగా వ్యవహరిస్తున్నాడని ఏపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు కు నోటీసులు జారీ కావడంపై అనిల్‌ కుమార్‌ యాదవ్‌ సెటైర్లు పేల్చారు. చంద్రబాబుకు ఐటీ నాలుగో నోటీసు ఇచ్చిందని.. ఒక ఏడాది అసెస్‌మెంట్ కు సంబంధించి 118 కోట్లు ముడుపులకు సంబంధించిన వ్యవహారం ఇదంటూ పేర్కొన్నారు.

మనోజ్ వాసుదేవ్ ను తనిఖీలు చేస్తుంటే తీగ లాగితే డొంక కదిలినట్లు చంద్రబాబు వ్యవహారాలు బయటకు వచ్చాయని.. షాపూర్ జీ పల్లోంజి లో మనోజ్ వాసుదేవ్ కీలక వ్యక్తి అంటూ ఆరోపించారు. 2020లోనే రెండు వేల కోట్ల రూపాయల ఆస్తి సమకూర్చుకున్నాడని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయని… చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో అన్ని వ్యవహారాలు బయటకు తీస్తే వేల కోట్ల రూపాయల దోపిడీ విషయాలు బయటకు వస్తాయన్నారు ఏపీ మాజీ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌.