శీతాకాలంలో మృదువైన అధరాల కోసం

అందమే ఆనందం

Lip care in winter
Lip care in winter

శీతాకాలం వచ్చేసింది .. ఈ సీజన్ ప్రభావానికి పెదాలు పొడారి , పగిలిలో పోయినట్టుగా మారతాయి. ఇలాంటప్పుడు ఇంట్లోనే సహజ సిద్దమైన పదార్ధాలతో మృదువుగా మార్చుకోవచ్చు.. ముందుగా ఒకటిన్నర చెంచా బి వాక్సిన్ గాజు గిన్నెలోకి తీసుకొని డబుల్ బాయిలర్ పద్దతిలో కరిగించాలి. . ఇందులో చెంచా షియా బట్టర్ వేసి కలిపి, ఆ తర్వాత చెంచా కొబ్బరి నొనె వేయాలి.. మరోసారి ఈ మిశ్రమాన్ని బాగా కలిపి పొయ్యిపై నుంచి దించి ఆరనివ్వాలి . ఈ ఆరిన దాంట్లో 5 చుక్కలు విటమిన్ ఈ , 7 చుక్కల లావెండర్ ఎస్సెన్షియల్ నొనె వేసి కలుపుతూ చిక్కగా అయిన తర్వాత అందులో చెంచా బ్రౌన్ షుగర్ వేయాలి . ఈ మిశ్రమాన్ని లిప్ స్టిక్ కంటైనర్ లో నింపి ఫ్రిజ్ లో ఉంచితే చాలు.. పెదాలు పొడారినట్టు అనిపించినపుడు పెదాలపై మృదువుగా క్రీం లా ఉన్న ఈ మిశ్రమాన్ని రుద్దాలి.. అధరాలకు ఇది మోయ్స్టిరైజర్ లా పనిచేస్తుంది. ఆ తర్వాత టిష్యూ పేపర్ తో పెదవులపై పేరుకున్న మృత కణాలను తొలగించేలా తుడిచి నీటితో కడిగితే చాలు.. అదరాలు మృదువుగా మారతాయి.

ఆధ్యాత్మిక సమాచారం కోసం: https://www.vaartha.com/specials/devotional/