అమరావతిలో కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఏపీలో వైస్సార్సీపీ – టీడీపీ నేతల మధ్య బహిరంగ ప్రమాణాలు కొనసాగుతున్నాయి. మీరు అవినీతి చేసారంటే..మీరు చేరంటూ సవాళ్లు..ప్రతిసవాళ్లు చేసుకుంటూ బహిరంగ చర్చలకు పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో అమరావతి లో ఇసుక అక్రమత్రవ్వకాలపై వైస్సార్సీపీ- టీడీపీ నేతల మధ్య సవాళ్లపై ఉత్కంఠ కొనసాగుతోంది.

ఇసుక అక్రమ తవ్వకాలపై పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకరరావు, మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇరు పక్షాలు అవినీతిపై చర్చించి అమరేశ్వర ఆలయంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసిరారు. ఈ ప్రమాణానానికి అటు వైస్సార్సీపీ ఇటు టీడీపీ ల నుండి కార్యకర్తలు భారీగా తరలి వస్తుండడం గమనించిన అమరావతి పోలీసులు గొడవలు జరుగుతాయని ముందే ఊహించి రాత్రి 9 గంటల వరకు 144 సెక్షన్ ను అమలులో పెట్టారు.

ఈరోజు ఉదయం మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ అమరలింగేశ్వర ఆలయానికి చేరుకున్నారు. ఆయనను పోలీసులు అడ్డుకోవడంతో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో శ్రీధర్‌తోపాటు కొంతమంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.