గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కెసిఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్నారుః కెటిఆర్‌

కామారెడ్డి ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందన్న కెటిఆర్

minister-ktr

హైదరాబాదా్‌ః కామారెడ్డి నియోజకవర్గం ఉద్యమ స్ఫూర్తిని తెచ్చిందని, పొత్తులో భాగంగా 2004లో కామారెడ్డి నియోజకవర్గాన్ని తీసుకున్నామని మంత్రి కెటిఆర్ అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కెసిఆర్ కామారెడ్డి నుంచి ఎందుకు పోటీ చేస్తున్నారనే చర్చ సర్వత్రా సాగుతోందని చెప్పారు. అయితే గంప గోవర్ధన్ విజ్ఞప్తి మేరకే కెసిఆర్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారన్నారు. నాడు గంప గోవర్ధన్ పార్టీలోకి రావడంతో బిఆర్ఎస్ బలం మరింతగా పెరిగిందన్నారు.

కామారెడ్డి నుంచి పోటీ చేయమని కెసిఆర్‌ను గంప గోవర్ధన్ అడుగుతారని తాను భావించలేదని, ఇప్పటికే అభివృద్ధితో ముందుకు సాగుతోన్న ఈ నియోజకవర్గం రాష్ట్రంలో నెంబర్ వన్ చేయాలనే ఉద్దేశ్యంతో కెసిఆర్ ఇక్కడి నుంచి బరిలోకి దిగాలని ఆయన కోరినట్లు చెప్పారు. కెసిఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక బలమైన ఆశయం ఉంటుందన్నారు.