అల్పాహారంతో ఆరోగ్యంగా..

Breakfast

చాలా మంది ఆహారపరంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ రోజుల్లో ఏది పడితే అది తినడం లేదు. అయితే ఇంటికెవరైనా వస్తే ముందుగా స్నాక్స్‌ పెడతాం. అందులో ముఖ్యంగా బంగాళాదుంప చిప్స్‌ అందరిని నచ్చుతాయి. కాని అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకు బదులుగా చిలగడ దుంపల్ని పల్చని స్లైసులుగా కట్‌ చేసి ఓవెన్‌లో వేయించాలి. వాటిపై ఉప్పు, కారం, మిరియాలపొడి చల్లితే రుచిగా ఉంటాయి.

అలాగే అరటికాయ చిప్స్‌ని కూడా చేయవచ్చు. ఇక కూల్‌ డ్రింక్స్‌ బదులు తాజా పండ్ల రసాలు మేలు రాత్రిపూట గాసు సీసాలో కొన్ని నీళ్లు పోసి దానిలో తులసి, పుదీనా, నిమ్మచెక్క, కీరా ముక్కలు వేయాలి. మర్నాటికి ఆ నీళ్లు మంచి సువాసన వస్తాయి. ఈ నీటిని తాగితే శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి మంచి శక్తి వస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు ఎక్కువగా నట్స్‌ తింటారు. ముఖ్యంగా వీటి నుంచి ప్రొటన్‌, విటమిన్‌ – ఇ లభిస్తాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అలా అని వేయించి నట్స్‌ తినకూడదు.

ఇంట్లోనే చేసుకుని తింటే బాగుంటుంది. ఇక పెరుగులో బాదం లేదా కొబ్బరిపాలు కలిపి అందులో కొన్ని అరపటి పండు ముక్కలు, తేనె వేసి ఈ మిశ్రమాన్ని పాప్సికిల్స్‌ మౌల్డ్స్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. అరటి పండు లేకపోతే ద్రాక్ష, కమలా పండ్ల ముక్కలు అయినా వేసుకోవచ్చు. ఇలా ఇతర పండ్లను చేర్చడం వల్ల రుచి, రంగు మారుతుంది. ఇలా తయారు చేసిన పాప్సికిల్స్‌ ఆరోగ్యానికి చాలా మంచిది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/