కుంభకర్ణుని వరాలు

Kumbakarna

కైకసి విశ్రవసువునకు కుంభకర్ణుడు జన్మించాడు. ఇతను చిన్నతనముననే చిన్నపిల్లల్ని ంపి తింటూ ఉండేవాడు. కుంభకర్ణుడు ఒకసారి బ్రహ్మను గురించి కఠోరమైన తపస్సు చేశాడు. అతని తపస్సుకు పుట్టిన వేడిగాగులు ఇంద్రలోకందాకా వీచాయి. అతని ఇంద్రుడు విషయం తెలుసుకుని భయపడి దేవతలను వెంటబెట్టుకుని బ్రహ్మవద్దకు వెళ్లి అతనికి వరాలు ప్రసాదిస్తే దేవతలందరూ అతని చేతిలో కీలుబొమ్మలవుతారు.

కావున మ్మల్ని కాపాడే బాధ్యత మీదే అని వేడుకున్నారు. బ్రహ్మ వారికి భయపడవలదని అభయమిచ్చి పంపి సరస్వతితో నీవు కుంభర్ణుని నాలుకపై ఉండి ఆరునెలలు నిద్ర, ఒక దినము ఆహారం కోరునల్లు చేయమని చెప్పాడు. ఆమె సరేనంది. బ్రహ్మ ప్రత్యక్షమై కుంభకర్ణా! నీ తపస్సుకు మెచ్చితిని. ఏమి వరము కావలయునో కోరుకొనుము అని అని పలుకగా కుంభకర్ణుడు వరములు అడుగు సమయానికి సరస్వతి అతని నాలుక మీద కూర్చుని దేవా! నాకు ఆరునెలలు నిద్ర. ఒక రోజు తిండి కలుగునట్లు వరమియ్యుము అని వరం కోరుకున్నాడు. బ్రహ్మ తథాస్తు! అని పలికి అంతర్ధానమయ్యాడు.

కుంభకర్ణుడు తరువాత తాను కోరిన వరములతో సంతృప్తిపడి నిద్ర ముంచుకొస్తుండగా లంకా రాజ్యమునకు బయలుదేరి వెళ్లి ఒకరోజంతా బాగా తిని ఆరునెలలు నిద్రలో మునిగిపోయాడు. ఆ విధంగా కుంభకర్ణుని జీవితం హాయిగా జరిగిపోతుండగా, ఈ బ్రహ్మ వరాల విషయం తండ్రి విశ్రవసునికి తెలిసి బ్రహ్మ వద్దకు వెళ్లి మహాబలవంతుడైన నా కొడుకు కుంభకర్ణుడికి ఆరునెలలు నిద్ర వరమిచ్చి అన్యాయం చేసావేమయ్యా అనడిగాడు. అతను కోరుకున్నాడు. నేను ఇచ్చాను. నా తప్పు ఏమీ లేదు. బాగా తిండి తిన్నవాడికి నిద్ర తప్పదు గదా! అయితే తిండికి తగ్గ పౌరుషం, వీరత్వం అన్నీ ఉంటాయి.

కాకపోతే అతన్ని మంచి నిద్రలో ఉండగా ఎవరైనా లేపితే శక్తిహీనుడయిపోతాడు. అందువల్ల అతను ఆరునెలలు పూర్తి నిద్రలోనే ఉండాలి. తిండి తినే ఒక్కరోజులో అతన్ని ఎవరూ ఎదుర్కొని జయించలేరు. అని బ్రహ్మ విశ్వవసునికి వివరించాడు. అన్న రావణాసురుడు సీతను అపహరించి తీసుకువచ్చి లంకలో పెట్టుకున్నాడు. తన భార్య సీత కోసం అయోధ్య రాముడు లంకాధిపతి మీద యుద్ధం ప్రకటించాడు. రామలక్ష్మణులు వానర సైన్యం సహాయంతో లంకాధిపతియైన రావణాసురునితో యుద్ధం చేస్తున్నాడు.

అప్పటికే రాక్షసులు సైన్యాధిపతులు చాలా మంది చనిపోయారు.
రావణుడు గాఢ నిద్రలో ఉన్న సోదరుడు కుంభకర్ణుని నిద్ర లేపించాడు. రాముని యుద్ధం సంగతి తెలిపి అతడిని కూడా రామునితో యుద్ధం చేయమన్నాడు రావణాసురుడు. అంతటి కుంభకర్ణుడు అన్నా! ఆ రాముడు సామాన్యుడు కాదు. అవతార స్వరూపుడైన విష్ణువే ఆ రాముడు. అతన్ని జయించటం ఎవరి వల్లా కాదు. మహాసాద్వి సీతను వారికిచ్చే§్‌ు. లేదంటే నువ్వూ ఉండవు. నీ లంకా రాజ్యాం ఉండదు అని హితవు చెప్పాడు. ఓరీ! పిరికిపందా యుద్ధం చెయ్యలేకపోతే చేతులు ముడుచుకుని కూర్చోగాని ఇటువంటి పిరికి మాటలు మాట్లాడకు, అని రెచ్చగొట్టాడు రావణాసురుడు. వెంటనే పౌరుషంతో రెచ్చిపోయిన కుంభకర్ణుడు రామలక్ష్మణులతో యుద్ధానికి తలపడి భీకరయుద్ధం చేశాడు. చిట్టచివరకు లక్ష్మణుని బాణాలకు కుంభకర్ణుడు నేలకొరిగాడు.

  • ఉలాపు బాలకేశవులు

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/