క్లీన్‌ కిచెన్‌ కోసం..

వంటింటి సంగతులు

Zero Waste Kitchen
Zero Waste Kitchen

జీరో వేస్ట్‌ కిచెన్‌:

ఇప్పుడు ఎక్కువమంది అనుసరిస్తున్న వంటింటి నిర్వహణ. కిచెన్‌ పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ఇలా చేయండి.

కిచెన్‌లో ఒలికిపోయిన ఆహారపదార్థాలను తుడిచేందుకు పేపర్‌ బదులు పాతనూలు వస్త్రం వాడాలి.

వాటిని శుభ్రం చేసుకొని తిరిగి ఉపయోగించే వీలుంటుంది. కిచెన్‌ టవల్‌నుకూడా వాడొ చ్చు. పప్పులు, ఇతర దినుసులు కొనేందుకు కిరాణా కొట్టుకు వెళ్లినప్పుడు క్లాత్‌బ్యాగ్‌ వెంట తీసుకెళ్లండి.

దాంతో ప్లాస్టిక్‌ కవర్ల వాడకం తగ్గుతుంది. ఎక్కువగా రెడీ టూ కుక్‌పుడ్‌ తినడం, వంట సామాగ్రి కోసం తరచూ కిరాణాకొట్టు, సూపర్‌మార్కెట్‌కు వెళ్లడం వెంటనే మానుకోండి.

నెలకు లేదంటే వారానికి సరిపడా సరుకులు ఒకేసారి తెచ్చుకోండి.

ఫలితంగా సమయంతో పాటు ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం తగ్గుతుంది. ఇంటి గార్డెన్‌ పెంచుకునే వారు వంటగదిలోని వ్యర్థాలతో కంపోస్ట్‌ ఎరువు తయారు చేసుకోవచ్చు.

మిగిలినపోయిన కూరగాయ ముక్కలు, పండ్ల తొక్కలు, పాడైన ఆహారపదార్థాలు, గుడ్డు పెంకులు..వీటన్నిటిని ఇంటి ఆవరణలోని గుంతలో వేస్తే సేంద్రియ ఎరువు సిద్ధం అవుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/