హాయిగా నిద్రపట్టేందుకు
అప్రయత్నంగా, పైసా ఖర్చులేకుండా రావలసిన నిద్ర, కొంత మందిని కంటి మీద కునుకైనా లేకుండా చేస్తుంది. అందుకు గల కారణాలు చాలానే ఉన్నా, మానసిక ఒత్తిళ్లు వాటిల్లో ప్రధానమైనవి. ఆదుర్ధా, ఆందోళనలు నిద్రలేమికి మూలంగా ఉంటాయి. వీటితో పాటు అజీర్తి, మలబద్ధకం, అతిగా స్పందించడం, ఆగ్రహావేశాలు, చివరికి రక్తహీనత కూడా నిద్రలేమికి కారణమవుతుంది. ఈ కారణాల నుంచి బయటపడటం ప్రథమంగా ఎవరైనా చేయాలి. నిద్రలేమి సమస్యను తొలగించడంలో యోగాసనాలు బాగా తోడ్పడతాయి. ప్రధానంగా సర్వాంగాసనం, పశ్చిమోత్తాసనం, శవాసనం బాగా ఉపయోగపడతాయి. నిద్రకు ముందు వెన్నెముక పైన హాట్ ప్యాక్‌లు పెట్టుకోవడం కూడా ప్రయోజనకరమే. నిద్రకు ముందు పాదాల పైన గోరువెచ్చని నీళ్లు ఒకటి రెండు నిమిషాల పాటు ధారగా పోయడం ద్వారా కూడా మంచి ఫలితం ఉంటుంది. ప్రాణాయామం వల్ల మెదడుతో పాటు శరీరంలోని అవయావాలన్నింటికి సరిపడా ఆక్సిజన్ అందుతుంది. అందువల్ల రోజూ క్రమం తప్పకుండా ప్రాణాయామం చేయడం ద్వారా నిద్రలేమి సమస్య నుంచి చాలా వరకు బయటపడవచ్చు.
తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/business/