ఇక బిజెపి ని కూడా జగన్ టార్గెట్ గా పెట్టుకున్నాడా..?

jagan

మొన్నటి వరకు బిజెపి ఫై పెద్దగా విమర్శలు చేయని ఏపీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ..ఇక ఇప్పుడు బిజెపి ఫై కూడా విమర్శలు చేయడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుండి కేంద్రం లో ఉన్న బిజెపి తో సన్నిహితంగా ఉంటూ వస్తున్న సంగతి తెలిసిందే. పార్లమెంట్ లో బిజెపి కి సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు.

ఇక ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది..త్వరలో జరగబోయే ఎన్నికల్లో బిజెపి ..టిడిపి – జనసేన పార్టీల తో పొత్తు పెట్టుకుంటున్నట్లు అర్ధం అవుతుంది. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలతో బిజెపి సంప్రదింపులు చేసింది. దీంతో జగన్..బిజెపి కూడా విమర్శలు చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘కేవలం టీడీపీ జనసేన కూటమే కాదు. ప్రత్యక్షంగా ఓ జాతీయ పార్టీ, పరోక్షంగా మరో జాతీయ పార్టీ నాపై దాడి చేస్తున్నాయి’ అంటూ విమర్శించారు. దీంతో వైసీపీ ఇక బీజేపీకి దూరం కానుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.