సమంత కు రాహుల్ క్రిస్మస్ గిఫ్ట్ ..

క్రిస్మస్ సందర్బంగా రాహుల్ ..సమంత కు ఓ గిఫ్ట్ ఇచ్చాడు. దానిని సామ్..సోషల్ మీడియా లో షేర్ చేసింది.”ప్రస్తుతం నీ దారి చీకటిగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అది వెలుగుతో ప్రకాశిస్తుంది. ఇప్పుడు నువ్ కదలడం కష్టంగా ఉండొచ్చు. కానీ త్వరలోనే అన్ని బాగుంటాయి. ఎందుకంటే నువ్ ఉక్కు మహిళవి. విజయం నీ జన్మ హక్కు. నువ్వు ఒక యోధురాలివి. నిన్ను ఏది ఓడించలేదు. ఇలాంటివి నిన్ను మరింత స్ట్రాంగ్ గా చేస్తాయి. ఎప్పటికీ స్ట్రాంగ్ ఉండేలా చేస్తాయి” అని రాసి ఉన్న ఫొటోను సమంతకు గిఫ్ట్ గా రాహుల్ ఇచ్చాడు.

రాహుల్ గిఫ్ట్ కు సామ్ రిప్లయ్ ఇచ్చింది. “థ్యాంక్యూ రాహుల్. బయట ఎవరైతో తమ జీవితాలతో పోరాడుతున్నారో వారందరి కోసం చెబుతున్నా. పోరాడుతూనే ఉండండి. ఇంకా మీరు బలంగా తయారవుతూ ఉంటారు. ఇంక దృఢంగా మారి కష్టాలను ఎదురిస్తారు” అని ఎమోషనల్ గా రాసుకొచ్చింది.

ప్రస్తుతం సామ్..మయోసిటీస్ తో బాధపడుతుంది. సౌత్ ఆఫ్రికా లో చికిత్స తీసుకుంటున్నట్లు ప్రచారం జరిగిన..కానీ ఆ వార్తల్లో నిజం లేదని ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది.