ఫ్రాన్స్ లో పోలీసుల వినూత్న నిరసన!

హ్యాండ్ కప్స్ రోడ్డుపై ఉంచి ప్రదర్శన

ఫ్రాన్స్ లో పోలీసుల వినూత్న నిరసన!
france-police-protest

ఫ్రాన్స్‌: ఫ్రాన్స్‌లో పోలీసుల వినూత్న నిరసన తెలిపారు. కరోనా వ్యాప్తి, లాక్ డౌన్ కారణంగా గడచిన మూడు నెలలుగా విపరీతమైన ఒత్తిడిలో డ్యూటీలు చేస్తున్న పోలీసులు, తమ విధులను బహిష్కరించి రోడ్లెక్కారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసులే విధులను బహిష్కరించడంతో ఫ్రాన్స్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. తమకు మెరుగైన పనితీరు వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, నేరస్థులకు వేయాల్సిన బేడీలను నడి రోడ్డుపై పడేసిన పోలీసులు, తమ నిరసనను తెలిపారు. తమ అంతర్గత వ్యవహారాల మంత్రి తక్షణం రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/