ఒమన్‌లో కరోనా వైరస్ కల్లోలం

ఒమన్: ఒమన్‌లో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. బుధవారం 810 కొత్త కేసులు నమోదైనట్లు ఒమన్ ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో ఒమన్‌లో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 26,079కి చేరింది. కొత్తగా నమోదైన 810 కేసులలో 468 మంది ఒమన్ పౌరులు ఉండగా, 342 మంది విదేశీయులు ఉన్నారని ఒమన్ ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. బుధవారం 708 మంది కరోనా రోగులు వైరస్ బారి నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 11,797కు చేరింది. అలాగే బుధవారం రెండు మరణాలు సంభవించడంతో ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 116కు చేరింది.
తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/