ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై సేవలు

WiFi Also on flying planes

విమాన ప్రయాణికులకు శుభవార్త.

ఇకపై ఎగురుతున్న విమానాల్లో కూడా వైఫై ద్వారా ఇంటర్నెట్‍ సేవల్ని వినియోగించుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పించనుంది.

ఈ మేరకు ఇంటర్నెట్‍ సేవల్ని ప్రయాణికులకు అందించేలా విమానయాన సంస్థలకు అనుమతిస్తూ పౌరవిమానయాన శాఖ నోటిఫికేషన్‍ విడుదల చేసింది.

విమానం ఎగురుతున్న సమయంలో ఇంటర్నెట్‍ సేవల్ని వినియోగించుకునేలా ప్రయాణికులకు పైలట్‍-ఇన్‍-కమాండ్‍ అనుమతించొచ్చు.

తద్వారా వైఫై సదుపాయంతో ల్యాప్‍ట్యాప్‍, ట్యాబ్‍, స్మార్ట్ వాచ్‍, ఈ-రీడర్‍ వంటి డివైజ్‍లను ఫ్లైట్‍ మోడ్‍ లేదా ఎయిర్‍ప్లేన్‍ మోడ్‍లో ఉంచి ఇం•ర్నెట్‍ని వాడుకోవచ్చు అని నోటిఫికేషన్‍లో పేర్కొన్నారు.

అయితే ఎయిర్‍క్రాఫ్ట్లో నిబంధనల ప్రకారం ఇంటర్నెట్‍ సేవల్ని అందించే సదుపాయాలు ఉన్నాయని డైరెక్టర్‍ జనరల్‍ ధ్రువీకరించాల్సి ఉంటుందని సృష్టంచేసింది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/movies/