మహబూబాబాద్ లోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్

మహబూబాబాద్ పట్టణంలోని కస్తూరిభా గాంధీ విద్యాలయంలో ఫుడ్ పాయిజన్ జరిగింది. పాఠశాలలో రాత్రి టమాటా కర్రితో భోజనం చేసిన విద్యార్థినులకు ఉదయం అస్వస్థకు గురయ్యారు. అందులో 15 మందికి వాంతలు, విరోచనాలు కావడంతో పరిస్థితిని గమనించిన టీచర్లు.. విద్యార్థినులను జిల్లా హాస్పటల్ కు తరలించారు. విద్యార్థినులకు టెస్టులు జరిపిన డాక్టర్లు రాత్రి తిన్న టమాటా కర్రీ వల్ల ఫుడ్ పాయిజన్ జరిగిందనై నిర్ధారించారు.

ప్రస్తుతం విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని హస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఈ ఘటన ఫై తల్లిదండ్రులు, ప్రతిపక్షపార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొద్దీ నెలలుగా తరుచు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరుగుతున్న సీరియస్ గా తీసుకోవడం లేదని , ఓచోట కాకపోతే మరోచోట ఫుడ్ పాయిజన్ జరుగుతుందని , ఇప్పటికైనా ప్రభుత్వం , అధికారులు సీరియస్ గా తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.