రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

Prime Minister Modi will visit Gujarat for two days

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ సెప్టెంబర్ 29-30 తేదీల్లో రెండు రోజులపాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. సూరత్, భావ్‌నగర్‌లలో ప్రధాని మోడీ రోడ్ షో కూడా ఉంటుంది. సూరత్, భావ్‌నగర్, అహ్మదాబాద్, అంబాజీలలో జరిగే వివిధ కార్యక్రమాలకు ప్రధాని మోడీ శ్రీకారం చుట్టనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనల్లో సుమారు రూ. 29,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో ప్రపంచ స్థాయి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి.

ప్రధాని మోడీ తన రెండు రోజుల్లో ముందుగా అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ మొదటి దశను ప్రారంభిస్తారు. అనంతరం గాంధీనగర్-ముంబై సెంట్రల్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలును ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. దీని తర్వాత ప్రధాని మోడీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అహ్మదాబాద్ మెట్రోలో కూడా ప్రయాణించనున్నారు. ఈ కార్యక్రమం ప్రకారం.. భావ్‌నగర్‌లో ప్రపంచంలోనే మొట్టమొదటి CNG టెర్మినల్‌కు కూడా ప్రధాని శంకుస్థాపన చేస్తారు. స్టేడియంలో 36వ జాతీయ క్రీడలను కూడా ఆయన ప్రారంభిస్తారు. అహ్మదాబాద్‌లోని GMDC మైదానంలో జరిగే నవరాత్రి ఉత్సవాలకు హాజరవుతారని PMO ఒక ప్రకటనలో తెలిపింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/