రాష్ట్రంలో 9,057 ఆర్టీసీ బ‌స్సులు : మంత్రి పువ్వాడ అజ‌య్

minister-puvvada-ajay-kumar-speech-in-assembly

హైదరాబాద్ : నేడు శాస‌న‌స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల సంద‌ర్భంగా జీహెచ్ఎంసీ, ఇత‌ర జిల్లాల్లో ఆర్టీసీ బ‌స్సుల సౌక‌ర్యంపై స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు మంత్రి పువ్వాడ అజ‌య్ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌యాణికుల అవ‌స‌రాల మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌ను న‌డుపుతున్నారు. 2014లో రాష్ట్ర వ్యాప్తంగా 9,800 బ‌స్సులు తిరిగితే.. 2022లో 9,057 బ‌స్సులు తిరుగుతున్నాయ‌ని తెలిపారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నాడు 3,554 బ‌స్సులు అందుబాటులో ఉంటే ప్ర‌స్తుతం 2,865 బ‌స్సులు న‌డుపుతున్నామ‌ని తెలిపారు.

హైద‌రాబాద్‌లో మినీ బ‌స్సులు న‌డిపేందుకు ప‌రిశీల‌న చేస్తామ‌న్నారు. డీజిల్ ధ‌ర‌లు భారీగా పెరిగినందునే మినీ బ‌స్సుల‌ను న‌డ‌ప‌ట్లేద‌ని స్ప‌ష్టం చేశారు. మినీ బ‌స్సుల్లో ప్యాసింజ‌ర్ కెపాసిటీ కూడా త‌క్కువ‌గా ఉంద‌న్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌యాణికుల‌కు వీలుగా ఉండేందుకు పెద్ద బ‌స్సుల‌ను న‌డుపుతున్నామ‌ని తెలిపారు. ములుగు కొత్త జిల్లా అయినందున అక్క‌డ బ‌స్ డిపో, బ‌స్టాండ్ ఏర్పాటుకు ప‌రిశీల‌న చేస్తున్నామ‌ని చెప్పారు. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే బాగు ప‌డుతుంది. బ‌స్సుల‌ను కొనేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. న‌గ‌రంలో డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్సుల‌ను న‌డిపేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాం. మేడారం జాత‌ర‌లో రూ. 11 కోట్లు మాత్ర‌మే ఆదాయం వ‌చ్చింది. 2763 బ‌స్సుల్లో 11 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణికుల‌ను త‌రలించామ‌ని మంత్రి పువ్వాడ అజ‌య్ పేర్కొన్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/