శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1.89 కోట్లు

తిరుమల : కరోనా ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా తిరుమల పరిసరాలు మళ్లీ భక్తులతో కోలాహలంగా కనిపిస్తున్నాయి. సోమవారం వేంకటేశ్వరస్వామి వారిని 17,310 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 7,037 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ద్వారా నిన్న రూ. 1.89 కోట్ల ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/