తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గొంగిడి సునిత

Gongidi Suntiha Mahender Reddy
Gongidi Suntiha Mahender Reddy

తిరుమల: తెలంగాణ రాష్ట్ర విప్‌ గొంగిడి సునిత సోమవారం తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారికి జరిగే నైవేద్య విరామ సమయంలో తన భర్తతో కలిసి దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు. సునీత దంపతులకు టిటిడి అధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సునిత మీడియాతో మాట్లాడుతూ.. స్వామివారి దర్శనం అద్భుతంగా జరిగిందని సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని ప్రార్థించినట్లు సునిత తెలిపారు. కాగా ఆలయ రంగనాయకుల మండపంలో సునీత దంపతులకు.. వేదపండితులు ఆశీర్వచనం అందించగా.. అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాలు అందజేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/