రాష్ట్రప‌తి, ఉప రాష్ట్రప‌తి, ప్రధాని బక్రీద్ శుభాకాంక్షలు

న్యూఢిల్లీ : నేడు బక్రీద్ సంద‌ర్భంగా ముస్లింల‌కు రాష్ట్రప‌తి రామ్‌నాథ్ కోవింద్, ప్ర‌ధాని మోడి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ‌, త్యాగానికి ప్ర‌తీకగా బ‌క్రీద్ పండుగ జ‌రుపుకుంటామ‌ని రాష్ట్ర‌ప‌తి కోవింద్ అన్నారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ బ‌క్రీద్ జ‌రుపుకోవాల‌ని సూచించారు.

‘ప్రేమ, సహనం, త్యాగాలకు ప్రతీక అయిన బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. పేదలతో, బంధువులతో ఆహారాన్ని పంచుకునే ఈ పండుగ, మనకున్న దానిలో నలుగురికీ సాయం చేయాలనే సందేశాన్నిస్తుంది. ఈ సందర్భంగా శాంతి, సహనం వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాను’ అని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు పేర్కొన్నారు.

ఈ ప‌ర్వ‌దినం భ‌క్తికి, విశ్వాసానికి సంకేత‌మ‌ని మోడీ అన్నారు. ఈ పండుగ సోద‌ర‌భావం, ఐక్య‌త‌కు ఆద‌ర్శంగా నిలుస్తుంద‌ని చెప్పారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/