బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

అమరావతి : సీఎం జగన్ ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు బుధవారం సీఎం జగన్‌ ట్వీట్‌ చేశారు. త్యాగం, సహనం బక్రీద్‌ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకోవాలని’’ సీఎం జగన్‌ ఆకాంక్షించారు. అల్లాహ్ ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని సీఎం జగన్ అభిలషించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/