ఢిల్లీలో ముగ్గురు జర్నలిస్టులకు కరోనా

అరవింద్ కేజ్రీవాల్ వెల్లడి

arvind kejriwal
arvind kejriwal

న్యూ ఢిల్లీ; దేశ రాజధాని ఢిల్లీలో 529 మంది జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించగా అందులో కేవలం ముగ్గురికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుత సమయంలో జర్నలిస్టుల పని చాల ముఖ్యమైనది. ఇంతటి విపత్కర పరిస్థితులలో కూడా వారు వార్తలు సేకరించి ప్రజలకి వాస్తవాలు తెలియ పరుస్తున్నారు, కాబట్టి పాత్రికేయులంతా క్షేమంగా ఉండాలని ఆయన కోరారు. కాగా ముంబయి, తమిళనాడులో జర్నలిస్టులకు కరోనా సోకినా విషయం తెలిసిందే. ఈ నేపథ్యములో ఢిల్లీలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు..

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/international-news/