శ్రీలంకకు మరోసారి సహాయం..40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను పంపిన భారత్‌

న్యూఢిల్లీ: శ్రీలంకకు భారత్‌ మరోసారి సహాయం అందించింది. ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు ఇంధన కొరతను తగ్గించేందుకు 40వేల మెట్రిక్‌ టన్నుల డీజిల్‌ను సరఫరా చేసినట్లు భారత్‌ మంగళవారం తెలిపింది. విదేశీ మారకద్రవ్య నిలువ అడుగుంటడంతో.. కరెన్సీ విలువ తగ్గింది. ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధనం దిగుమతి చేసుకునేందుకు సహాయం అందించేందుకు భారత్‌ గత నెలలో శ్రీలంకకు అదనంగా 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను పొడగించింది. ఈ మేరకు ఫ్రిబవరి 2, 2022న పెట్రోలియం ఉత్పత్తుల కోసం కొనుగోలు భారత్‌ క్రెడిట్‌ ఒప్పందంపై సంతకాలు చేశాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/