నిండా ముంచిన అకాల వర్షం

ప్రభుత్వమే ఆడుకోవాలనంటున్న రైతులు

untimely-rains-hit-farmers
untimely-rains-hit-farmers

హైదరాబాద్; తెలంగాణలో కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. ఆరుగాలం కష్టించి పండించిన పంట రైతుల కళ్లముందే నీటిపాలయింది. పంట చేలలో ఆరబెట్టి కొనుగోలు కేంద్రాల వద్దకు తెచ్చిన ధాన్యం వర్షాల కారణంగా తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, పెద్దపల్లి, సిద్ధిపేట, గజ్వేల్, కరీంనగర్, యాదాద్రి జిల్లాలలో కురిసిన భారీ వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. కాగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి ; https://www.vaartha.com/news/national/