అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ పై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు

Avinash Reddy must be arrested: ysrcp MLA

కడప: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారంపై వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని అనవసరంగా ఇరికించారని ఆరోపించారు. ‘‘ఈ కేసులో ఇక అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ తప్పదు. అరెస్టయినా ఆయన బెయిల్‌పై బయటకు వస్తారు. ఈ కేసులో టిడిపి అధినేత చంద్రబాబు వెనకుండి కుట్ర చేసి అవినాష్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు. నిందితుడిగా చేర్చినంత మాత్రాన నేరం చేసినట్లు కాదు. హత్యలో అవినాష్‌ పాత్ర ఉందని న్యాయస్థానంలో రుజువైతే నేను రాజకీయాల్లో ఉండనని చెప్పా. ఆ మాటకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను’’ అని శివప్రసాద్‌రెడ్డి చెప్పారు.