తెలంగాణ లో పోటాపోటీగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ సభలు

లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ లో అధికార – ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా సభలు , సమావేశాలు నిర్వహిస్తూ ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జనజాతర పేరుతో సభలు నిర్వహిస్తుంటే..బిఆర్ఎస్ జలదీక్ష , ప్రజా ఆశీర్వాద సభ పేరులతో కాంగ్రెస్ ఫై విరుచుకుపడుతూ ప్రజలను ఆకట్టుకునే పని చేస్తుంది.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రానికి కరువు వచ్చింది..తాగేందుకు నీరు లేదు , పంటలు ఎండిపోయిన పరిస్థితి , ఇచ్చిన హామీలను గాలికి వదిలేసింది ఇలా అనేక విమర్శలతో బిఆర్ఎస్ సభలు నిర్వహిస్తుంది. ఈరోజు ఇరు పార్టీలు పోటాపోటీగా సభలు నిర్వహిస్తుంది. నారాయణపేటలో కాంగ్రెస్ జనజాతర సభ నిర్వహించనుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మరోవైపు తాగునీటి సమస్యను తీర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జోగులాంబ గద్వాల జిల్లాలో జలదీక్ష చేయనుంది. ఈ దీక్షలో హరీశ్ రావు, RS ప్రవీణ్ కుమార్ పాల్గొననున్నారు.

మరోవైపు రేపు సంగారెడ్డి జిల్లాలోని సుల్తాన్‌పూర్‌లో కేసీఆర్ బహిరంగ సభకు హాజరుకానున్నారు. మెదక్ ఎంపీ అభ్యర్థి తరఫున ఆయన ఓట్లు అభ్యర్థించనున్నారు. ఈ సభకు సుమారు లక్ష మందిని సమీకరించేందుకు BRS ప్లాన్ చేస్తోంది. మాజీ మంత్రి హరీశ్ రావు సభ ఏర్పాట్లను సమీక్షిస్తున్నారు. కాగా మెదక్ నుంచి BRS అభ్యర్థిగా మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్నారు.