చంద్రబాబు ఫై రాళ్లు విసిరిన దుండగులు

ఎన్నికల ప్రచారం అంటే నేతలు , పార్టీ కార్యకర్తలు భయపడే పరిస్థితికి వచ్చింది. ఏ నుండి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో..? ఎవరు ఏ రాయి పెట్టి కొడతారో..? ఆ రాళ్లు ఎవర్ని తాకుతాయో అనే భయంలో ఇప్పుడు ఏపీలో రాజకీయ పార్టీల నేతలు , కార్యకర్తలు ఉన్నారు. నిన్నటికి నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫై విజయవాడ లో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో ఆయన కనుబొమ్మకు గాయం అయ్యింది. ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటుండగా..ఈరోజు ప్రతిపక్ష పార్టీల నేతలను టార్గెట్ చేసారు. కొద్దీ సేపటి క్రితం తెనాలి లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫై రాయి విసరగా..అదృష్టం కొద్దీ అది పక్కకు పడడంతో పెను ప్రమాదం తప్పినట్లు అయ్యింది.

ఈ ఘటన గురించి అంత మాట్లాడుకుంటుండగానే..గాజువాక లో చంద్రబాబు నిర్వహించిన ప్రజాగళం సభలో కొంతమంది దుండగులు రాళ్లు విసిరారు. ఈ రాళ్లు సభలో ఎవరికి తగలేకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈ ఘటన ఫై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. కావాలనే కొంతమంది గంజాయి బ్యాచ్‌, బ్లేడ్‌ బ్యాచ్‌ రాళ్లు వేస్తున్నారు. కొద్దీ సేపటి క్రితం తెనాలిలో పవన్‌ కల్యాణ్‌పై కూడా రాళ్లు వేశారు. ఇక ఇప్పుడు నాపై వేస్తున్నారు. గత ఎన్నికలప్పుడు నాపై ఇలాగే రాళ్లు వేశారు అంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేసారు.