జగన్ ఫై రాళ్ల దాడి ..నిఘా విభాగం కీలక సూచనలు

వైసీపీ అధినేత, సీఎం జగన్ ఫై తాజాగా విజయవాడ లో రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తుండగా ఓ గుర్తు తెలియని వ్యక్తి జగన్ ఫై రాయి విసరడం తో ఆయన కనుబొమ్మ ఫై గాయమైంది. దీంతో ఓ రెస్ట్ తీసుకోని , ఈరోజు తన యాత్రను పునప్రారభించబోతున్నారు. ఈ దాడి నేపథ్యంలో నిఘా విభాగం కీలక సూచనలు జారీ చేసింది.

జగన్ కు, జనానికి మధ్య బారికేడ్లు ఉండాలని భద్రతా సిబ్బందికి నిఘా వర్గాలు సూచించాయి. క్రేన్లు, ఆర్చులు, భారీ గజమాలలు తగ్గించాలని.. వీలైనంత వరకూ బస్ లో కూర్చునే రోడ్ షోలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. జగన్ బస్సుకు వంద మీటర్ల పరిధిలో జన ప్రవేశం నిషిద్ధం విధించాలని పేర్కొన్నట్లు తెలుస్తోంది. మరీ అవసరమైతేనే జగన్ బస్సుకు దగ్గరగా నేతలు, కార్యకర్తలను అనుమతించాలని చెప్పింది. ఇకపై జగన్ పర్యటనలు, రోడ్ షోలు, పాల్గొనే సభల్లో భద్రతా వైఫల్యాలు లేకుండా చూడాలని సిబ్బందికి స్పష్టం చేసింది.