నేడు రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం.. నగరంలో ట్రాఫిక్ మళ్లింపు

బషీర్‌బాగ్, ఏఆర్ పెట్రోల్ పంప్, బీజేఆర్ సర్కిల్ వద్ద రాకపోకలపై ఆంక్షలు

Traffic restrictions in Hyderabad

హైదరాబాద్ః హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నేడు రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహన రాకపోకలపై పలు ఆంక్షలు విధించారు. ఈ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు (ట్రాఫిక్) కమిషనర్ జి. సుధీర్ బాబు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల ప్రకటన ప్రకారం..

.ఏఆర్ పెట్రోల్ బంక్ జంక్షన్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను జంక్షన్ వద్ద నాంపల్లి, చాపెల్ రోడ్డువైపు మళ్లిస్తారు.
.గన్‌ఫౌండ్రీ ఎస్‌బీఐ నుంచి బీజేఆర్ కూడలి వైపు వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డులోకి మళ్లిస్తారు.
.బషీర్‌బాగ్ కూడలి నుంచి బీజేఆర్ కూడలి వైపు వచ్చే ట్రాఫిక్‌ను కింగ్ కోఠీ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రహదారులపై పంపిస్తారు.
.సుజాత పబ్లిక్ స్కూల్ లేన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే ట్రాఫిక్‌ను స్కూల్ జంక్షన్ నుంచి నాంపల్లి వైపు మళ్లిస్తారు.
.పంజాగుట్ట, వి.వి. విగ్రహం కూడలి, రాజీవ్‌గాంధీ విగ్రహం, నిరంకారి, పాత సైఫాబాద్ ఠాణా, లక్డీకాపూల్, ఇక్బాల్ మినార్, రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీసు కాంప్లెక్స్, బషీర్‌బాగ్, బీజేఆర్ విగ్రహం కూడలి, ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రీ, అబిడ్స్ సర్కిల్, ఏఆర్ పెట్రోల్ బంక్, లిబర్టీ, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్, హైదర్‌గూడ కూడళ్ల వైపు వెళ్లకుండా ఉండాలిన పోలీసుల సూచించారు.
.రవీంద్ర భారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు ఎల్బీ స్టేడియం ప్రధాన గేటు ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద మలుపు తీసుకోవాలి. నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లాలి.