వారణాసి కోర్టుకు జ్ఞాన‌వాపి మ‌సీదుపై సైంటిఫిక్ స‌ర్వే రిపోర్టు అంద‌జేత

Archaeological panel submits sealed report on Gyanvapi Mosque in Varanasi court

వార‌ణాసి: కాశీ విశ్వ‌నాథ్ ఆల‌య స‌మీపంలో ఉన్న జ్ఞాన‌వాపి మ‌సీదు పై చేప‌ట్టిన స‌ర్వే నివేదిక‌ను జిల్లా జ‌డ్జికి అప్ప‌గించారు. సీల్డ్ క‌వ‌ర్‌లో ఉన్న రిపోర్టును పురావాస్తు శాఖ స్టాండింగ్ కౌన్సిల్ అమిత్ శ్రీవాత్స‌వ్‌.. వార‌ణాసి జ‌డ్జి టేబుల్ ముందు పెట్టారు. ఈ కేసులో అల‌హాబాద్ హైకోర్టు ఈనెల 21వ తేదీన త‌న తీర్పును వెలువ‌రించ‌నున్న‌ది. జ్ఞాన‌వాపి మ‌సీదులో పూజ‌లు నిర్వ‌హించేందుకు హ‌క్కు క‌ల్పించాల‌ని కోరుతూ కొంద‌రు హిందువులు పిటీష‌న్ వేసిన విష‌యం తెలిసిందే. ఆ పిటీష‌న్ ఆధారంగా జ్ఞాన‌వాపి మ‌సీదులో సైంటిఫిక్ స‌ర్వే చేప‌ట్టారు. హిందువుల త‌ర‌పున కేసు దాఖ‌లు చేసిన మ‌ద‌న్ మోహ‌న్ యాద‌వ్ మాట్లాడుతూ.. వార‌ణాసి జిల్లా కోర్టులో ఆర్కియాల‌జీ శాఖ త‌న సైంటిఫిక్ రిపోర్టును ప్ర‌జెంట్ చేసిన‌ట్లు చెప్పారు.