‘ఆదిపురుష్’ టీమ్ కీలక నిర్ణయం

ఆదిపురుష్ టీం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్​లో ఒక సీటును అమ్మకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ మేరకు ‘ఆదిపురుష్’ మూవీ టీమ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ప్రభాస్ – కృతి సనన్ జంటగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రనౌత్ డైరెక్షన్లో ఈ మూవీ తెరకెక్కుతుంది. సాహో, రాధేశ్యామ్ సినిమాల తర్వాత రాబోతున్న ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. రామాయణం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో సైఫ్‌ అలీఖాన్‌ లంకాధిపతి రావణాసురుడుగా కనిపిస్తుండగా రాముడి గా ప్రభాస్ , సీతగా కృతి కనిపించనున్నారు. టీ-సిరీస్‌, రెట్రో ఫైల్స్ సంస్థలు అత్యంత భారీ బడ్జెట్‌తో దాదాపు రూ.500 కోట్లతో ఈ సినిమాను నిర్మించాయి.

జూన్ 16 న పలు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తిరుపతి లో నేడు భారీ ఎత్తున నిర్వహించబోతున్నారు. సినీ చరిత్రలోనే తొలిసారి 50 అడుగుల ప్రభాస్‌ హాలోగ్రామ్‌ ను ఈ ఈవెంట్ లో ప్రదర్శించనున్నారు. అయోధ్యను తలపించేలా భారీ సెట్‌ వేశారు. అలాగే ఈ చిత్రాన్ని ప్రదర్శించే ప్రతి థియేటర్​లో ఒక సీటును అమ్మకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ మేరకు ‘ఆదిపురుష్’ మూవీ టీమ్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ‘రామాయణ పారాయణం జరిగే ప్రతి చోటకు హనుమంతుడు విచ్చేస్తాడనేది మన నమ్మకం. ఈ నమ్మకాన్ని గౌరవిస్తూ ప్రభాస్ రాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ సినిమాను ప్రదర్శించే ప్రతి థియేటర్​లో ఒక సీటును విక్రయించకుండా హనుమంతుడి కోసం ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుంది’ అని మూవీ టీమ్ పేర్కొంది.